ఈ మూడు బ్యాంకుల్లో వడ్డీ ఎక్కువే

Interest is high

న్యూఢిల్లీ: చేతిలో డబ్బు ఉందా? దీన్ని బ్యాంకులో డిపాజిట్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారా? అయితే ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో బ్యాంకులున్నాయి. ఎందులో డబ్బులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలో అర్థం కావడం లేదా? మీ డబ్బుకు ఏ బ్యాంకులో ఎంత వడ్డీ వస్తుందో తెలుసుకోవాలని భావిస్తున్నారా? అయితే తెలుసుకోండి. దేశీయ దిగ్గజ బ్యాంకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) ఇటీవల ఎఫ్‌డి రేట్లు కుదించింది.

15 బేసిస్‌ పాయింట్ల మేర కోత విధించింది. ఇప్పుడు ఎస్‌బిఐ ఫిక్స్‌డ్‌ డిపా జిట్లపై వడ్డీరేటు 4.5శాతం నుంచి 6.10శాతం మధ్యలో ఉంది. ఇది సాధారణ కస్టమర్లకు వర్తిస్తుంది. అదే సీనియర్‌ సిటిజన్లకు 5 శాతం నుంచి 6.6శాతం మధ్యలో వడ్డీ లభిస్తుంది. ప్రైవేట్‌ రంగానికి చెందిన ఐసిఐసిఐ బ్యాంకులో ఎఫ్‌డిలపై వడ్డీరేటు 4శాతం నుంచి ప్రారంభవు తోంది. 7 రోజుల నుంచి ఏడాదిలోపు ఎఫ్‌డిలపై 5.75శాతం వడ్డీ పొందవచ్చు. ఏడాది నుంచి 10 ఏళ్ల కాల పరిమితిలోని ఎఫ్‌డిలపై 6.2శాతం నుంచి 6.4శాతం మధ్యలో వడ్డీ వస్తుంది.

సీనియర్‌ సిటిజన్స్‌కు వడ్డీ రేటు 4.5శాతం నుంచి 6.9శాతం మధ్యలో లభిస్తుంది. ప్రైవేట్‌ రంగ దిగ్గజ బ్యాంకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేటు 3.5శాతం నుంచి ప్రారంభమవుతోంది. గరిష్టంగా 6.3శాతం వరకు వడ్డీ పొందవచ్చు.

ఇది సాధారణ కస్టమర్లకు వర్తిస్తుంది. అదే సీనియర్‌ సిటిజన్స్‌కు అయితే 4 శాతం నుంచి 6.8శాతం మధ్యలో వడ్డీ రేటు లభిస్తుంది. ప్రైవేట్‌ రంగానికి చెందిన మరో ప్రముఖ బ్యాంకు ఎస్‌ బ్యాంకులో వడ్డీరేటు 5 శాతం నుంచి ప్రారంభమవుతోంది. గరిష్టం 7.25శాతం వరకు వడ్డీ పొందవచ్చు.

అదే సీనియర్‌ సిటిజన్స్‌ అయితే 5.5శాతం నుంచి 7.75శాతం మధ్యలో వడ్డీరేటు కైవసం చేసుకో వచ్చు. యాక్సిస్‌ బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేటు 3.5శాతం నుంచి ప్రారంభమవుతోంది. ఎఫ్‌డిలపై గరిష్టంగా 6.5శాతం వరకు వడ్డీరేటు పొందవచ్చు. ఇది సాధారణ కస్టమర్లకు వర్తిస్తుంది. అదే సీనియర్‌ సిటిజన్స్‌కు అయితన యాక్సిస్‌ బ్యాంకులో 3.5శాతం నుంచి 7.3శాతం మధ్యలో వడ్డీ వస్తుంది.

తాజా ‘నిఘా’ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/investigation/