అమెరికాలో ఒక్క రోజే 14 లక్షలకు పైగా కరోనా కేసులు

ప్రతి సెకనుకు నమోదవుతున్న 9 కేసులు

న్యూయార్క్ : కరోనా మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. మహమ్మారి ఉగ్రరూపానికి అల్లాడిపోతోంది. నిన్న ఒక్క రోజే అమెరికాలో 14 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. డెల్టా వేరియంట్ తో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. గత వారం రోజుల సగటును పరీక్షిస్తే ప్రతి సెకనుకు 9 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్ సమయంలో కూడా అమెరికా భారీగా ప్రాణ నష్టాన్ని చవిచూసింది. ఇప్పుడు కూడా మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. రాబోయే వారాల్లో అమెరికాను కరోనా మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/