చైనీయులది మళ్లీ అదే పద్దతి
లాక్‌డౌన్ ఎత్తివేయడంతో ఆనందలో వూహన్ ప్రజలు
మళ్లీ పాము.. గబ్బిళం వంటి మాంసాహారాలపై ఆసక్తి చూపుతున్న చైనీయులు

వూహన్: కరోనా వైరస్.. మొదట ఇది చైనా లోని వూహన్ లో పుట్టి, ఇది ప్రపంచ దేశాలకు విస్తరించింది. ఒకవైపు ప్రపంచం మీద ఈ వైరస్ ప్రభావం చూపుతుంటే.. తాజాగా వూహన్‌లో చైనా ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేసింది. దీంతో ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చి ఆనందంతో పొంగిపోతున్నారు. కాగా చైనీయులు తినే పలు రకాల మాంసాహారాల వల్ల ఈ వైరస్ పుట్టిందని ఇటీవల చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినా ప్రస్తుతం లాక్‌డౌన్ ఎత్తివేయడంతో వూహన్ ప్రజలు మళ్లీ కుక్క.. పిల్లి.. పాము.. గబ్బిలం వంటి మంసాలు కొనుగోలుకు అమితంగా ఆసక్తి చూపుతున్నారనే విషయం అందరిని విస్మయానికి గురిచేస్తుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/