వంది మందికి పైగా టీడీపీలో చేరిన వైస్సార్సీపీ శ్రేణులు

వైస్సార్సీపీ పతనం మొదలైందన్న నారా లోకేశ్

more-than-100-ysrcp-followers-of-tanuku-joins-tdp-in-presence-of-nara-lokesh

తణుకు: తణుకులో వైస్సార్సీపీ కి చెందిన వంద మందికి పైగా నేతలు, కార్యకర్తలు టీడీపీ లో చేరారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో వీరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తణుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో వీరు టీడీపీలో చేరారు. వీరంతా తణుకు రూరల్ మండలం తేతలి, ఇరగవరం, సూరంపూడి గ్రామాలకు చెందినవారు. టీడీపీలో చేరిన వారిలో మట్టా వెంకట్, మట్టా నాగేశ్వరరావు, కట్టా శ్రీరామమూర్తి, భూపతిరాజు, వెంకటరామరాజు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ… అవినీతి, అరాచక విధానాలతో వైస్సార్సీపీ పతనం మొదలైందని అన్నారు. వైస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీడీపీ లో చేరుతున్నారని చెప్పారు.