ఆదిభట్ల యువతీ కిడ్నాప్ కేసు : చర్లపల్లి జైలు కు 32 మంది నిందితులు

ఆదిభట్ల యువతీ కిడ్నాప్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రాగన్నగూడకు చెందిన వైశాలి ని గత కొద్దీ రోజులుగా నవీన్ రెడ్డి అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో వైశాలి ఇంట్లో పెండ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. శుక్రవారం మధ్యాహ్నం వైశాలి కి పెండ్లి చూపులు ఏర్పాటు చేయగా..ఇది తెలుసుకున్న నవీన్‌ రెడ్డి అనే యువకుడు వందమంది యువకులతో కలిసి సదరు యువతి ఇంటికి వచ్చి దాడి చేశాడు. అనంతరం యువతిని బలవంతంగా లాక్కెళ్లారు.

ఆ తర్వాత పోలీసులు వైశాలిని క్షేమంగా ఇంటికి చేర్చారు. ప్రస్తుతం దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు చర్లపల్లి జైలు కు తరలించారు. కిడ్నాప్‌‌‌‌‌‌‌‌ కేసులో ఒక మైనర్ సహా 32 మందిని అరెస్ట్ చేసినట్లు శనివారం పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు నవీన్‌‌‌‌‌‌‌‌రెడ్డితో పాటు విధ్వంసానికి పాల్పడ్డ మరో 40 మందికిపైగా పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. అయితే, నవీన్‌‌‌‌‌‌‌‌ రెడ్డిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది.

మరోపక్క సదరు యువతీ తనను బలవంతంగా కిడ్నాప్ చేశారని వెల్లడించారు. చాలా ఘోరంగా ట్రీట్ చేశారన్న ఆమె.. కారుతో తీవ్రంగా కొట్టినట్లు చెప్పారు. నవీన్ రెడ్డితో తనకు ప్రేమ లేదని, పెళ్లి కూడా జరగలేదని స్పష్టం చేశారు. పెళ్లి జరిగిందని చెబుతున్న రోజున.. తాను హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకున్నట్లు తెలిపారు. నవీన్ తనను కిడ్నాప్ చేసి హింసించాడన్న ఆమె తన ఫొటోలు మార్ఫింగ్ చేసి ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కెరీర్ ను నాశనం చేశాడని కన్నీటిపర్యంతమయ్యారు.