సిఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న శివరాజ్‌ సింగ్‌

సాయంత్రం 7 గంటలకు చౌహాన్ ప్రమాణస్వీకారం

Shivraj Singh Chouhan
Shivraj Singh Chouhan

మధ్యప్రదేశ్‌: బిజెపి నేత శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మధ్యప్రదేశ్‌ సిఎంగా ఈరోజు సాయంత్రం 7 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత ఆయనతో పాటు ఆయన వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో, కమల్ నాథ్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత గురువారం విశ్వాస పరీక్షను ఎదుర్కోకుండానే… ముఖ్యమంత్రి పదవికి కమల్ నాథ్ రాజీనామా చేశారు. దీంతో, మధ్యప్రదేశ్ లో బిజెపి అధికార పీఠాన్ని అధిష్టించబోతోంది. కాగా శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగోసారి సీఎంగా బాధ్యతలను స్వీకరించనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/