బాక్సాఫీస్ రికార్డులు బద్ధలు

Akhanda movie-Box office records breaking

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం నిన్న (డిసెంబర్ 02) ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. .గతంలో వీరిద్దరి కలయికలో సింహ , లెజెండ్ చిత్రాలు వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు సాధించడం తో అఖండ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా సినిమాను బోయపాటి తెరకెక్కించడం తో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు సంబరాలు చేసుకుంటున్నారు. సినిమాకు హిట్ టాక్ రావడం తో సినిమాను చూసేందుకు ప్రేక్షకులు పరుగులు పెడుతున్నారు. ఇక ఫస్ట్ డే కలెక్షన్లు రికార్డ్స్ బ్రేక్ చేశాయని సమాచారం.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను అఖండ కలెక్షన్స్ కుమ్మేసాయి. అఖండ ప్రీమియర్స్ తోనే 331,803 డాలర్లు అందుకుంది. మొదటిరోజు 101,458కోట్ల వసూళ్లు రాగా మొత్తంగా 3.24 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో షాక్ ఇచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే..నైజాం ఏరియాలో ఈ సినిమా 4.39 కోట్లు రాగా, సీడెడ్ లో 4.02కోట్లు, ఉత్తరాంధ్ర 1.36కోట్లు, ఈస్ట్ 1.05కోట్లు, వెస్ట్ 96లక్షలు, గుంటూరులో 1.87కోట్లు, కృష్ణ 81లక్షలు, నెల్లూరు 93లక్షలు రాబట్టింది. ఆంధ్ర, తెలంగాణలో మొత్తం రూ. 15.39కోట్ల షేర్ రాబట్టినట్లు సమాచారం. కరోనా లాక్‌డౌన్‌ అనంతరం అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న టాప్ సినిమాల్లో అఖండ కూడా నిలుస్తుందనే అర్థమవుతుంది. అంతే కాకుండా బాలకృష్ణ కెరీర్ లోనే ఈ సినిమా అత్యదిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది.