సోమవారం రికార్డు స్థాయిలో గుండెపోట్లు నమోదయ్యాయి

farmer died of heart attack

సోమవారం రికార్డు స్థాయిలో గుండెపోట్లు నమోదైనట్లు ఐర్లాండ్ లోని బెల్ ఫాస్ట్ హెల్త్ అండ్ సోషల్ కేర్ ట్రస్ట్, రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ పరిశోధన తెలిపింది. ప్రస్తుత కాలంలో వయసు తో సంబంధం లేకుండా గుండెపోట్లు వస్తున్నాయి. గుండెపోటు.. ఎప్పుడు, ఎవరికి వస్తుందో డాక్టర్లు కూడా చెప్పలేకపోతున్నారు. ఆరోగ్యంగా ఉన్నామని అనుకునే వాళ్లు కూడా హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయిన ఘటనలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. అయితే, గుండె పోటుకు గురయ్యే.. అదీ తీవ్రమైన గుండెపోటుకు గురయ్యే ముప్పు సోమవారమే ఎక్కువని ఐర్లాండ్​ వైద్యులు పేర్కొన్నారు.

2013 నుండి 2018 వరకు జరిపిన అధ్యయనంలో 10,528 మంది పేషెంట్ల సమాచారాన్ని సేకరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను బ్రిటిష్ కార్డియో వాస్క్యులర్ సొసైటీ కాన్ఫరెన్స్ లో పరిశోధకులు వెల్లడించారు. ఆదివారం కూడా స్టెమీ మరణాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.

ప్రత్యేకమైన ఈ స్టెమీ గుండెపోటు వారంలో మొదటి రోజు అంటే సోమవారం ఎక్కువగా కనిపిస్తోందని ఈ అధ్యయనం తెలిపింది. సోమవారం – స్టెమీ సంభావ్యతకు మధ్య బలమైన సంబంధాన్ని గుర్తించామని, ఇది గతంలో కూడా వెల్లడైందని తెలిపారు. అయితే సోమవారమే ఎక్కువగా ఈ గుండెపోట్లు ఎందుకు సంభవిస్తున్నాయో వివరించలేకపోయారు. అయితే ఈ కేసులు సోమవారం సంభవించడానికి కార్కాడియం రిథమ్ తో సంబంధం ఉందని గతంలోని అధ్యయనాలు సూచిస్తున్నాయి.