వరద భాదితులకు తీపి కబురు తెలిపిన సీఎం జగన్

cm-jagan

ఏపీలోని వరద భాదితులకు బియ్యం , నిత్యావసరాలు అందజేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా చాలామంది నిరాశ్రయులయ్యారు. వరదలకు పలు ఇళ్లు నేలమట్టం అయ్యాయి..అలాగే ఇంట్లోని సమన్లు , బియ్యం ఇలా అన్ని వరదకు కొట్టుకుపోయాయి. దీంతో తినడానికి తిండి లేక, ఉండడానికి ఇళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ తరుణంలో సీఎం జగన్ వరద బాధితులకు 25 కేజీల బియ్యం, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు, కేజీ పామాయిల్‌, కేజీ కందిపప్పు ఇవ్వాలని ఆదేశించారు.

ఏపీలో వర్షాలు, నదుల్లో వరద ప్రవాహం, సహాయ పునరావాసం కార్యక్రమాలపై సీఎం జగన్ సమీక్షించారు. వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సహాయ పునరావాసం కార్యక్రమాలు అత్యంత సమర్థవంతంగా సాగాలని కలెక్టర్లను ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.

అధికారులు మానవీయ కోణంలో సహాయం అందించాలి. ఉండాల్సినదాని కన్నా ఎక్కువగా మానవత్వంతో పనిచేయాలి. దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఒక్కరూపాయి అదనంగా ఖర్చు చేసినా, బాధితులకు అండగా ఉండాలి. వారి పట్ల మానవతాధృక్పధంతో వ్యవహరించాలి. కలెక్టర్లు మాకు మంచి చేశారు అన్న మాటే వినిపించాలి. మన వల్ల జిల్లాకు మంచి జరిగింది, మంచి కలెక్టర్‌ అనిపించుకునేలా పనిచేయాలి. అధికారులు ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి అని జగన్ అన్నారు.