మునుగోడులో ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ కావాలి – సీఎం కేసీఆర్

మునుగోడు ప్రజా దీవెన సభ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి బిజెపి పార్టీ ఫై నిప్పులు చెరిగారు. మునుగోడులో ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ కావాలని పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కేసీఆర్ శనివారం మునుగోడు లో భారీ బహిరంగ సభ ఏర్పటు చేసారు. ఉదయం హైదరాబాద్ నుండి రోడ్డు మార్గాన మునుగోడు కు వచ్చిన ఆయన..దాదాపు గంట సేపు ప్రసంగించారు.

జై తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఫ్లోరైడ్ సమస్యను గతంలో పాలకులు ఎవరూ పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ఉద్యమం చేపట్టిన తరువాత సమస్యను అనేకసార్లు ప్రస్తావించానన్నారు. నల్లగొండ నగరా పేరుతో 15 రోజుల నాడు జిల్లా మొత్తం తిరిగానని ఉద్యమ సమయం నాటి విషయాలను ప్రస్తావించారు. ఎన్నికలు రాంగనే ఆగమాగం కావొద్దు.. మన చేతుల్లో ఉన్న అధికార్ని ఎవరికో అప్పచెప్పి ఎవరో.. పోరాటం చేయమంటే చేయరు. ప్రజల చేతుల్లో ఉండే ఒకేఒక ఆయుధం ఓటు. దాని ద్వార నిర్మాణమయ్యే శక్తి.. మనకు ఉపయోగపడుతదా? పడదా? ఆలోచించి ఓటు వేయాలన్నారు.

ప్రజల చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం ఓటు అని, దానిని సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. మునుగోడు ఉప ఎన్నిక ఎవరిని ఉద్ధరించేందుకు? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న మాయామశ్చీంద్ర ఏంటి? అని ప్రశ్నించారు. మోదీ దోస్తులు సూట్‌కేసులు పట్టుకుని రెడీగా ఉన్నారు. కార్పొరేట్ వ్యవసాయం చేద్దామనే కుట్ర జరుగుతోంది. బీజేపీ పాలనలో ఒక్క మంచి పని అయినా జరిగిందా? రాష్ట్రపతి ఎన్నికలప్పుడు 20 ప్రశ్నలు అడిగాను, దేనికీ సమాధనం చెప్పలేదు. ఎయిర్‌పోర్టుల, విమానాలు, రైళ్లు, రోడ్లు అమ్ముతున్నారు. మిగిలింది ఇక రైతులు, రైతుల భూములు, పంటలు. మన నోట్లో మట్టి పోసే పని జరుగుతోంది. బావుల వద్ద మీటర్లు పెట్టాలని కేంద్రం అంటోంది. నేను చచ్చినా మీటర్లు పెట్టనని తెగేసి చెప్పిన. బీజేపీ లక్ష్యం ఎరువుల ధరలు పెంచాలి, కరెంట్ రేటు పెంచాలి, పండి పంటకు ధర ఇవ్వకూడదు. మరి వ్యవసాయ భూములకు మీటర్లు పెట్టే బీజేపీ కావాలా? మీటర్లు వద్దన్న కేసీఆర్ కావాలా? మునుగోడు ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. బీజేపీకి ఓటు పడితే బావి దగ్గర మీటరు పడ్డట్లే అని కేసీఆర్ హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీపై పోరాటానికి మునుగోడులో ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇది పార్టీల ఎన్నిక కాదని, రైతుల బతుకుదెరువు ఎన్నిక అని పిలుపునిచ్చారు.