ఈనెల 7, 8న ఏపిలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొననున్న మోడీ

Modi will participate in the election campaign in AP on 7th and 8th of this month

అమరావతిః బీజేపీ ఏపీలో టీడీపీ, జ‌న‌సేన‌తో క‌లిసి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో ఎన్‌డీఏ అభ్య‌ర్థుల త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన‌డానికి ప్ర‌ధాని నరేంద్ర మోడీ ఈ నెల 7, 8వ తేదీల్లో ఏపీలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ మేర‌కు బీజేపీ బుధ‌వారం ప్ర‌ధాని ఎన్నిక‌ల ప్ర‌చార పూర్తి షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది.

7వ తేదీ మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు రాజ‌మ‌హేంద్ర‌వ‌రం బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి పురందేశ్వ‌రి త‌ర‌ఫున వేమ‌గిరిలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మోదీ పాల్గొని ప్ర‌సంగించనున్నారు. అలాగే సాయంత్రం 5.45 గంట‌ల‌కు అన‌కాప‌ల్లి ప‌రిధిలోని రాజుపాలెం స‌భ‌లో ప్ర‌ధాని పాల్గొంటారు. ఇక 8వ తేదీ సాయంత్రం 4 గంట‌ల‌కు పీలేరు స‌భ‌కు హాజ‌ర‌వుతారు. రాత్రి 7 గంట‌ల‌కు విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ మైదానం నుంచి బెంజి స‌ర్కిల్ వ‌ర‌కు రోడ్‌షో నిర్వ‌హిస్తారు.