ఏపీ ప్రజలు చికెన్ తినాలంటే భయపడిపోతున్నారు

ఏపీలో చికెన్ ధరలు చూసి ప్రజలు తినాలంటే భయపడిపోతున్నారు. ఒకప్పుడు ఇంటికి ఎవరైనా బంధువులు వస్తేనో..ఆదివారం వస్తేనో నాన్ వెజ్ తినేవారు. కానీ ఇప్పుడు ఆలా కాదు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చికెన్ , మటన్ తెచ్చుకొని తింటున్నారు. అయితే ఇప్పుడు నాన్ వెజ్ ప్రియులు నాన్ వెజ్ తినాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే చికెన్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి.

మొన్నటి వరకు 240 పలికిన చికెన్ ధర.. ఇప్పుడు ఉన్నట్టుండి అమాంతం రూ.300 కు పెరిగింది. దీంతో మాంసం ప్రియులు ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. స్కిన్‌లెస్‌ చికెన్‌ కిలో 300 ఉండగా , మాములు చికెన్ కిలో రూ. 280 వరకు పలుకుతుంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరగడం కూడా చికెన్‌ ధర మండిపోవడానికి ఒక కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. ఎండవేడి వల్ల కోడి పిల్లలు ఎదగడంలో జాప్యం జరుగుతోందంటున్నారు. ఎండల ప్రభావం తట్టుకోలేక కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. వాతావరణంలో ఆకస్మి క మార్పుల వల్ల కోడి పిల్లల్లో 40 నుంచి 60 శాతం మరణాలు సంభవిస్తున్నాయని పౌలీ్ట్ర ఫామ్‌ నిర్వాహ కులు వాపోతున్నారు.

సాధారణంగా డిసెంబర్‌, జనవరి నెలల్లో ప్రారంభిస్తే ఒక కోడి పిల్ల కిలోన్నర బరువు పెరగడానికి సుమారు 40 రోజులు పడుతుంది. కానీ మార్చి నెల నుంచే ఎండలు మండి పోతుండడంతో పిల్ల దశ నుంచి కోడి దశకు ఎదగడానికి 50 నుంచి 60 రోజులు పడుతోందని పౌలీ్ట్రవర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రభావం కోళ్ల ఉత్పతిపై పడుతోంది. దీనినుంచి కోడి పిల్లలను కాపాడడానికి కోళ్ల ఫారాలలో కూలర్లు, ఏసీలు పెడితేగానీ కోడి పిల్లలు బతికే పరిస్థితి లేదంటున్నారు. ఇలా అనేక కారణాల వల్ల చికెన్ ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు.