నేడు ఆరుగురు సిఎంలతో ప్రధాని సమావేశం

15 మంది సిఎంలుకాగా ..మారిన షెడ్యూల్

pm modi

న్యూఢిల్లీ: ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ జూన్ 30తో ముగియనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడి తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ఈరోజు 15 మంది సిఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కావాల్సిఉంది. అయితే మోడి తన షెడ్యూల్ ను సవరించుకున్నారు. కేవలం ఆరుగురితో మాత్రమే మాట్లాడాలని ఆయన నిర్ణయించుకున్నారు. కాగా కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన తరువాత, నరేంద్ర మోడి నిర్వహిస్తున్న ఏడవ వీడియో కాన్ఫరెన్స్ ఇది. మంగళవారం నాడు దాదాపు 20 రాష్ట్రాల సిఎంలు, ప్రతినిధులతో మోడి మాట్లాడారు. అయితే, నేడు మోడి మాట్లాడనున్న రాష్ట్రాల్లోనే కేసుల సంఖ్య అత్యధికంగా ఉంది. తమ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ఈ సమావేశానికి హాజరు కాలేనని ఇప్పటికే ఏపి సిఎం జగన్‌ పీఎంఓకు సమాచారాన్ని పంపిన విషయం తెలిసిందే.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/