బీఆర్ఎస్ పార్టీ ఫై సోము కామెంట్స్

BJP Leader Somu Veeraju
somu veerraju comments to BRS

దేశ వ్యాప్తంగా ఇప్పుడు బీఆర్ఎస్ పేరు మారుమోగిపోతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్..ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రగతి సాధించాలని బీఆర్ఎస్ పార్టీ ని ప్రకటించారు. దసరా సందర్బంగా జాతీయ పార్టీ ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల రాజకీయ నేతలు, ప్రజలు బీఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక ఏపీలోనూ బీఆర్ఎస్ ను స్వాగతిస్తూ ప్లెక్సీ లు వెలువడంతో ఏపీలోను బీఆర్ఎస్ స్థానాలు దక్కించుకోవడం ఖాయం అన్నట్లు ఇప్పటి నుండే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ తరుణంలో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుపై స్పందించారు.

జాతీయ పార్టీ పెట్టే హక్కు కేసీఆర్ కు లేదని విమర్శించారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్.. వీఆర్ఎస్ తీసుకోవాల్సిందేనంటూ సెటైర్లు పేల్చారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని సోము వీర్రాజు జోస్యం చెప్పారు. కేసీఆర్ కూతురు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కుందన్నారు. ఆంధ్రా ప్రజలు ద్రోహులు, సన్యాసులు అని నోటికొచ్చినట్లు బూతులు తిట్టిన కేసీఆర్ కు ఏపీకి వచ్చే అర్హత లేదని విమర్శించారు. జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టే హక్కు కేసీఆర్ కు అసలు లేదని వ్యాఖ్యానించారు.