లడక్‌లో ఘర్షణ..నలుగురు భారత జవాన్ల పరిస్థితి విషమం

ప్రకటించిన ఆర్మీ వర్గాలు

లడక్‌లో ఘర్షణ..నలుగురు భారత జవాన్ల పరిస్థితి విషమం
Four Indian Soldiers Critical After Ladakh Clash

న్యూఢిల్లీ: లడక్‌లో భారత్‌, చైనా  మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈఘటనలో భారత జవాన్లపై రాళ్లు విసిరి, రాడ్లతో చైనా సైనికులు దాడికి దిగిన ఘటనలో మరికొంత మంది భారత జవాన్లు గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఇప్పటికే భారత ఆర్మీ నిర్ధారించిన విషయం తెలిసిందే.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/