గోదావరి మహోగ్రరూపం

ధవళేశ్వరం బ్యారేజి వద్ద నీటి మట్టం 19.70 అడుగులు -భద్రాచలం వద్ద 56.30 అడుగులు

water level at Dhavaleswaram Barrage
water level at Dhavaleswaram Barrage

Rajamahendravaram: గోదావరి మహోగ్రరూపం దాల్చింది. అంతకంతకూ వరద ప్రవాహం పెరుగుతోంది.

ధవళేశ్వరం బ్యారేజి వద్ద మంగళవారం ఉదయం 8 గంటలకు గోదావరి నీటి మట్టం  19.70 అడుగులకు చేరింది.

మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

అలాగే భద్రాచలం వద్ద గోదావరి ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. ఈ ఉదయం 8గంటలకు భద్రాచలంవద్ద గోదావరి నీటి మట్టం 56.30 అడుగులకు చేరింది.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/