బిజెపికి భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేదు – రాహుల్ గాంధీ

బిజెపి పార్టీ కి భయపడే ప్రసక్తి లేదన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. చింతన్​ శిబిర్ సమావేశాల ముగింపు కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన.. పార్టీని బలోపేతం చేయాలంటే దగ్గరి దారులు ఉండవని తెలిపారు. నేతలంతా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో తుదిశ్వాస వరకు వెంట ఉంటానని భరోసా ఇచ్చారు.

బీజేపీలో ద‌ళితుల‌కు స‌రైన స్థాన‌మే లేద‌న్న రాహుల్‌… కాంగ్రెస్ పార్టీలో మాత్రం అన్ని వ‌ర్గాల‌కు స‌మ ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని తెలిపారు. ప్ర‌జ‌ల‌తో నేరుగా సంబంధం క‌లిగి ఉండ‌ట‌మ‌నేది కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే ఉంద‌ని ఆయ‌న చెప్పారు. అయితే ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల‌తో పార్టీకి సంబంధాలు తెగిపోయాయ‌న్న ఆయ‌న‌.. ఈ విష‌యాన్ని అంద‌రూ అంగీక‌రించాల్సిందేన‌న్నారు. ప్ర‌జ‌ల‌తో నేరుగా సంబంధాల పున‌రుద్ధ‌ర‌ణ‌కు య‌త్నించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ య‌త్నం ఒక్క‌రోజో, రెండు రోజుల్లోనో ముగియ‌రాదన్న రాహుల్‌.. నెల‌ల త‌ర‌బ‌డి క‌ష్ట‌ప‌డాల్సిందేన‌ని చెప్పారు.