ఏప్రిల్‌ 14నుంచి ఓటిటి లో కబ్జా స్ట్రీమింగ్

కరోనా దెబ్బకు థియేటర్స్ మూతపడడంతో సినీ ప్రేక్షకులు ఓటిటి అలవాటుపడ్డారు. ఆలా అలవాటుపడ్డ జనాలు థియేటర్స్ కు వచ్చేందుకు పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. పెద్ద హీరో సినేమైతే..అది కూడా హిట్ అయితే తప్ప థియేటర్స్ కు వెళ్లి సినిమా చూడడం లేదు. మరోపక్క డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ఓటిటి సంస్థలు కూడా సినిమా రిలీజ్ అయినా మూడు వారాలకే స్ట్రీమింగ్ చేస్తున్నారు. దీంతో సినీ లవర్స్ అంత వందలు వందలు పోసి థియేటర్స్ వెళ్లి సినిమా చూసే బదులు ఏచక్క ఇంట్లో ఫ్యామిలీ తో హ్యాపీ గా సినిమా చూసేయొచ్చు కదా అని డిసైడ్ అవుతున్నారు.

ఇదిలా ఉంటె తాజాగా కన్నడ హీరో ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ కబ్జా..ఓటిటి లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఆర్‌ చంద్రు దర్శకత్వం వహించిన ఈ సినిమా గతవారం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. కన్నడలో పర్వాలేదనిపించనా.. మిగితా భాషల్లో మాత్రం డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14 నుండి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ డిసైడ్ అయినట్లు సమాచారం. కన్నడ తో పాటు అన్ని భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. దీనిపై అతి కొద్దీ రోజుల్లో అధికారిక ప్రకటన చేయనున్నారట.