తెలుగు ఛానల్ తో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ..

దేశ వ్యాప్తగా నాల్గొవ దశ పోలింగ్ మే 13 న జరగబోతుంది. ఈ తరుణంలో రేపటితో నాల్గొవ విడత పోలింగ్ జరగనున్న రాష్ట్రాల్లో ప్రచారం ముగుస్తుంది. వాటిలో తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. తెలంగాణ లో 17 లోక్ సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ కు ఉప ఎన్నిక జరగనుంది. అలాగే ఏపీలో 175 అసెంబ్లీ , 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ఆసక్తి నెలకొని ఉంది. గత రెండు నెలలుగా అన్ని పార్టీలు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఎవరికీ వారు తమ గెలుపు ధీమా వ్యక్తం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటూ వస్తున్నారు. సభలు , ర్యాలీలు , సమావేశాలతో పాటు సోషల్ మీడియా లలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే రేపటితో ప్రచారానికి తెరపడనుంది. ఇన్ని రోజులు మోతమోగించిన మైకులు , సోషల్ మీడియా వేదికలు రేపు సాయంత్రం తర్వాత సైలెంట్ కానున్నాయి.

మొన్నటి వరకు రోడ్ షోస్, సభలు , సమావేశాల్లో పాల్గొన్న పార్టీల అధినేతలు..ఇప్పుడు సాటిలైట్ చానెల్స్ లలో ఇంటర్వూస్ ఇస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే జగన్, చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు పలు చానెల్స్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా..ఇప్పుడు దేశ ప్రధాని మొదటి సారి తెలుగు మీడియా ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద విషయం అనే చెప్పాలి. దేశ వ్యాప్తంగా ప్రచారం తో బిజీ గా ఉన్న మోడీ.. తొలిసారి ఎన్టీవీకి ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రధాని ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు.

పదేళ్లుగా తిరుగులేని విజయాలను సాధిస్తూ ప్రజల గుండెలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న మోడీ.. ఎన్టీవీతో ఈ సార్వత్రిక ఎన్నికల ముచ్చట్ల గురించి మాట్లాడనున్నారు. గతంలో భక్తి టీవీ నిర్వహించిన కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా ప్రధాని మోడీ హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జరుగుతున్న కీలక పరిణామాలపై ప్రధాని మోడీ సమాధానమివ్వనున్నారు. మరి ఆ ఇంటర్వ్యూ ఎలా ఉండబోతుందో..ఏ ఏ ప్రశ్నలు అడుగుతుందో..వాటికీ మోడీ ఎలాంటి సమాదానాలు చెపుతారో చూడాలి.

YouTube video