ప్రధాని మోడీపై కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేశ్‌ కీలక వ్యాఖ్యలు

‘PM Jhooth bolo Yojana to seek mandate…’: Congress leader Jairam Ramesh hits out at PM Modi

న్యూఢిల్లీః కాంగ్రెస్ పార్టీ నేత జైరామ్ రమేశ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నరేంద్ర మోడీ ప్రచార కార్యక్రమం ఆసాంతం హిందు-ముస్లిం చుట్టే తిరుగుతుందని విమర్శించారు. ఝార్ఖండ్‌లో మీడియాతో మాట్లాడుతూ… ప్రధాని కేవలం హిందూ-ముస్లిం రాజకీయాలు చేయదలుచుకుంటే ఆయన ప్రజాజీవితంలో కొనసాగేందుకు పనికిరారని వ్యాఖ్యానించారు.

మన జాతీయ చిహ్నం కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుందని… ప్రధాని మాత్రం పొరపాటున కూడా నిజాలు మాట్లాడరని విమర్శించారు. అస‌త్య‌మేవ జ‌య‌తే అనే మూలసిద్ధాంతంతో ప‌నిచేసే తొలి ప్రధాని మోడీయేనని మండిపడ్డారు. అస‌త్యాల‌తో పాల‌న సాగించే మోడీ ఓ బ్ల‌ఫ్ మాస్ట‌ర్ అని తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.