సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం

సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలియజేసారు. ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో మహేష్ బాబు భార్య ఆయన్ని కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి తీసుకెళ్లిన దగ్గరి నుండి కూడా ఆయన్ను వెంటిలేటర్ ఫై ఉంచి చికిత్స అందజేశారు. కాంటినెంటల్ టాప్ డైరెక్టర్స్ అంత కూడా ఆయనకు చికిత్స అందించినప్పటికీ , ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. మంగళవారం ఉదయం ఆయన కన్నుమూశారు. కృష్ణ ఇకలేరు అనే వార్త యావత్ సినీ పరిశ్రమ తట్టుకోలేకపోయింది. కడసారి ఆయన్ను చూసేందుకు సినీ ప్రముఖులు , రాజకీయ నేతలు తరలివస్తున్నారు. కొద్దీ సేపటి క్రితమే ఆయన భౌతిక దేహాన్ని నానక్ రామ గూడ లో ఆయన స్వగృహానికి తీసుకొచ్చారు.

ప్రస్తుతం సినీ ప్రముఖులంతా ఆయనకు సంతాపం తెలిపేందుకు వస్తున్నారు. పవన్ కళ్యాణ్, వెంకటేష్ , త్రివిక్రమ్ , రాజేంద్ర ప్రసాద్ , మురళి మోహన్ తో పాటు చాలామంది వచ్చి వీడ్కోలు పలికి , మహేష్ కు ధైర్యం తెలిపారు. తండ్రి పార్ధీవదేహాన్నిచూసి మహేష్ కన్నీరు మున్నీరు అయ్యారు. కృష్ణ మరణ వార్తతో సినీలోకం మూగబోయింది. ఆయన పార్ధీవదేహాన్ని పవర్ స్టార్ కళ్యాణ్ సందర్శించి నివాళి అర్పించారు. పవన్ మాట్లాడుతూ.. మహేష్‌ ముగ్గురు కుటుంబసభ్యులను కోల్పోవడం బాధాకరం. ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతీ తెలుపుతున్నా అని పవన్ అన్నారు.