రామబాణం ఫస్ట్ డే కలెక్షన్స్

లక్ష్యం, లౌక్యం లాంటి రెండు హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ డైరెక్షన్లో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన మూవీ రామబాణం. ఈ సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హయతి నటించగా , జగపతి బాబు , కుష్బూ కీలక పాత్రల్లో నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. వివేక్ కూచిభోట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ నిన్న (మే 05) ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు బాగా తగ్గాయి.

ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్స్ చూస్తే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొత్తంగా మొదటి రోజు 1.17 కోట్ల షేర్ కలెక్షన్స్ 2.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక కర్ణాటక మిగతా రాష్ట్రాల్లో ఓవర్సీస్ లో కలుపుకుని మరో 15 లక్షలు వచ్చాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమాకు మొదటి రోజు కేవలం 1.25 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి.