ప్రభుత్వ లాంఛనాలతో రేపు సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు
రేపు మధ్యాహ్నం 3 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం

హైదరాబాద్ః సూపర్ స్టార్ కృష్ణ 79 ఏళ్ల వయసులో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలను రేపు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు సూచనలు చేశారు. అంత్యక్రియలు ఎల్లుండి జరుగుతాయని తొలుత వార్తలు వచ్చాయి. అయితే ఈ అంశంపై కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.
కాసేపటి క్రితమే కృష్ణ పార్థివదేహాన్ని కాంటినెంటల్ ఆసుపత్రి నుంచి నానక్ రామ్ గూడలోని ఇంటికి తరలించారు. సాయంత్రం 5 గంటలకు భౌతికకాయాన్ని గచ్చిబౌలి స్టేడియంకు తరలిస్తారు. ప్రజల సందర్శనార్థం రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే ఉంచుతారు. ఆ తర్వాత అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/international-news/