హైదరాబాద్ లో రెండు రోజుల పాటు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు..

moulali-hitech-city-mmts-likely-to-be-available-from-february

మెట్రో రాకముందు వరకు హైదరాబాద్ లో ఎంఎంటీఎస్‌ రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతుండేవి..ఎప్పుడైతే మెట్రో అందుబాటులోకి వచ్చింది..ఎంఎంటీఎస్‌ రైళ్లు కళ తప్పింది. అసలు నగరంలో ఎప్పుడు ఎంఎంటీఎస్‌ రైళ్లు నడుస్తున్నాయి..నడవడం లేదో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది. నెల రోజులో పలుమార్లు పలు కారణాలతో ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు ప్రకటన వస్తుంది. తాజాగా ఈరోజు కూడా అలాగే వచ్చింది.

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో రేపు, ఎల్లుండి (మే 25, 26) పలు ఎంఎంటీఎస్‌ సర్వీసులను, నాలుగు డెమూ సర్వీసులను రద్దు చేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన చేసింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులు, ఫుట్‌ ఓవర్‌ వంతెనల (FOB) ల నిర్మాణం నేపథ్యంలో రెండు రోజులపాటు పలు రైలు సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపారు. సికింద్రాబాద్‌-ఫలక్‌నుమా, మేడ్చల్‌-సికింద్రాబాద్‌, లింగంపల్లి-మేడ్చల్‌, హైదరాబాద్‌-మేడ్చల్‌ మధ్య సేవలందించే 22 ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చీఫ్‌ పీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. వీటితోపాటు సిద్దిపేట-సికింద్రాబాద్‌ మధ్య సర్వీసులందించే నాలుగు డెమూ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.