ఢీకొన్న రెండు రైళ్లు.. 53 మందికి గాయాలు

53-injured-in-collision-between-passenger-goods-train-in-maharashtra-gondia

ముంబయిః మహారాష్ట్రలోని గోందియా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఛత్తీస్​గఢ్​ బిలాస్​పుర్​ నుంచి రాజస్థాన్​ జోధ్​పుర్​కు వెళ్తున్న భగత్​ కి కోఠీ ప్యాసింజర్​ ట్రైన్​.. ఓ గూడ్స్​ ట్రైన్​ను ఢీకొట్టింది. దీంతో మూడు బోగీలు పట్టాలు తప్పగా 50 మందికిపైగా గాయపడ్డారు. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/