కరీంనగర్‌ మేయర్‌గా సునీల్‌రావు

sunil-Rao-will-elect-as-Karimnagar-mayor
sunil-Rao-will-elect-as-Karimnagar-mayor

కరీంనగర్‌: కరీంనగర్‌ మేయర్‌ పీఠం విషయంలో ఎట్టకేలకు ఉత్కంఠ ముగిసింది. వెలమ సామాజిక వర్గానికి చెందిన యాదగిరి సునీల్‌రావుకు మేయర్‌ పదవి దక్కింది. కార్పొరేషన్‌ ఎన్నికల్లో 33వ డివిజన్‌ నుంచి పోటీ చేసిన సునీల్‌రావు భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన కరీంనగర్‌ కార్పొరేషన్‌ నుంచి కౌన్సిలర్‌గా, కార్పొరేటర్‌గా నాలుగుసార్లు విజయం సాధించారు. మంత్రి గంగుల కమలాకర్‌కు సమకాలీకుడైన సునీల్‌రావుకు ప్రణాళికాసంఘం చైర్మన్‌ వినోద్‌కుమార్‌తో సాన్నిహిత్యం ఉంది. ఇవాళ ఉదయం 11 గంటలకు మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా స్వతంత్రంగా గెలిచిన ఎడుగురు సభ్యులు టిఆర్‌ఎస్‌లో చేరడంతో కరీంనగర్‌ కార్పొరేషన్‌లో టిఆర్‌ఎస్‌కు బలం 40కి చేరింది. కరీంనగర్‌లో 60 స్థానాలకుగాను టిఆర్‌ఎస్‌ 33, బిజెపి 13, ఎంఐఎం 7, ఇతరులు ఏడు డివిజన్లు గెలుచుకున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/