సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ఎమ్మెల్సీ కవిత

brs-leader-mlc-k-kavitha-press-meet

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టును సవాల్ చేస్తూ ఆమె భర్త అనిల్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. ఈడీ ఆమెను అక్రమంగా అరెస్టు చేసిందని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని ఆయన కోర్టును ఆశ్రయించనున్నారు.

ఈ నెల 19న కవితపై కేసు విచారణ జరగనుందని, ఆమెను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని, ఇది గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధమని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. కాగా, ఆదివారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితను విచారించారు. విచారణలో ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చినట్లు సమాచారం. విచారణను అధికారులు వీడియో రికార్డు చేసినట్లు సమాచారం. విచారణ తర్వాత కవితను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, మాజీ మంత్రి తన్నీరు హరీష్, కవిత భర్త అనిల్, లాయర్ మోహిత్ రావు కలిశారు.