జగన్ మోహన్ రెడ్డి ఓ సైగ చేస్తే రాష్ట్రంలో ఒక్క టీడీపీ నేత కూడా బయట తిరగలేడు – వెల్లంపల్లి

తెలుగుదేశం నేతలకు మంత్రి వెల్లంపల్లి వార్నింగ్ ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డి ఓ సైగ చేస్తే రాష్ట్రంలో ఒక్క టీడీపీ నేత కూడా బయట తిరగలేడని అన్నారు. విజయవాడలో వైసీపీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వెల్లంపల్లి …చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గులేదా ? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎలా‌ ముఖ్యమంత్రి అయ్యాడో అందరికి తెలుసని…. హైద్రాబాద్ లో చంద్రబాబుకి ఇంద్రా ప్యాలెస్ లేదా ? అని ఫైర్‌ అయ్యారు. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు ఆశాంతి సృష్టించాలని చూస్తున్నారని… వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తే చంద్రబాబు, అతని తాబేదారులు తట్టుకోలేరని హెచ్చరించారు. గంజాయికి పేటెంట్ హక్కు చంద్రబాబుదేనని… ముఖ్యమంత్రి పై చంద్రబాబు, అతని అడవి పందులు మాట్లాడితే ఖబడ్దార్ అని వార్నింగ్‌ ఇచ్చారు.

అలాగే మంత్రి అనిల్ సైతం దమ్ముంటే చూసుకుందాం రమ్మంటూ ప్రతిపక్ష పార్టీ నేతలకు సవాల్ విసిరారు. ‘‘సీఎంని తిట్టిస్తే గాజులు తొడుక్కున్నామా? సీఎం జగన్‌రెడ్డి కోసం దేనికైనా సిద్దమే. మీరు చిత్తూరులో పుట్టుంటే రా.. చూసుకుందాం. నెల్లూరులో వారం రోజులు ఉంటా రమ్మను. సీఎంని తిట్టిన విషయం పవన్‌కు గుర్తు లేదా? సీఎం ఫ్యాక్షనిస్ట్‌ అయితే మీరు ఉంటారా? వైసీపీ కార్యకర్తలను ఎవడు తాకుతాడో చూస్తాం. ఎవడొస్తాడో రండిరా.. అవసరమైతే కాన్వాయ్‌ని కూడా పక్కనబెట్టొస్తా’’ అని హెచ్చరించాడు.