విశాఖ ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం

చంద్రబాబుకు కల్పించిన రక్షణపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి

ashok babu
ashok babu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుకు కల్పించిన రక్షణపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ అశోక్‌బాబు డిమాండ్‌ చేశారు. మంగళగిరి టిడిపి కార్యలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. విశాఖలో చంద్రబాబు పర్యటనకు అనుమతిచ్చి తిరిగి అడ్డుకోవడం వైఎస్‌ఆర్‌సిపి కుట్రలో భాగమేనని అశోక్‌బాబు విమర్శించారు. ప్రతిపక్ష నేతను ఉత్తరాంధ్రలో తిరగనివ్వబోమని ఓ మంత్రి అంటున్నారని …ఉత్తరాంధ్ర ఏమైనా వారి జాగీరా అని ప్రశ్నించారు. విశాఖ ఘటనపై శనివారం గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని అన్నారు. విశాఖలో చంద్రబాబుపై దాడి చేసిన వారంతా వైఎస్‌ఆర్‌సిపి పెయిడ్‌ ఆర్టిస్టులే అని ఆయన విమర్శించారు. వైఎస్‌ఆర్‌సిపి తాటాకు చప్పుళ్లకు టిడిపి భయపడదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోలీసులను ప్రభుత్వం ఎలా వాడుకుంటుందో ప్రజలు ప్రత్యక్షంగా చూశారన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/