కార్పోరేటర్‌పై బిజెపి మాజీ ఎమ్మెల్యె అత్యాచారం

నమ్మించి మోసం చేశాడని కేసు పెట్టిన సదరు మహిళ

Former BJP MLA Narendra
Former BJP MLA Narendra

మహారాష్ట్ర: ముంబయికి చెందిన బిజెపి నేత నరేంద్ర మెహతాపై అత్యాచారం కేసు నమోదైంది. పరారీలో ఉన్న ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆపై వేధిస్తున్నాడంటూ థానే జిల్లాలోని భయాందర్ పట్టణానికి చెందిన మహిళా కార్పొరేటర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెహతాతోపాటు సంజయ్ తార్కర్ అనే మరో వ్యక్తిపైనా పోలీసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరు మూడు రోజుల క్రితం బిజెపికి రాజీనామా చేసినట్టు మిరాభయాందర్ పోలీసులు తెలిపారు. కార్పొరేటర్, నరేంద్ర మెహతాలు అభ్యంతరకరంగా ఉన్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. మెహతా తనను 1999 నుంచి లైంగికంగా వేధిస్తున్నాడని, తన కుటుంబ సభ్యులకు అతడి నుంచి ముప్పు ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత కార్పొరేటర్ పేర్కొన్నారు. మెహతా, తార్కర్‌లపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/