స్వార్థ ప్రయోజనాల కోసమే విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌

yalamanchili rajendra prasad
yalamanchili rajendra prasad

విజయవాడ: విశాఖపట్టణం రాజధానికి అనువైన ప్రాంతం కాదని కమిటీలు ఇచ్చిన రిపోర్టులో ఉందని టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ ప్రజలు ప్రశాంతతను కోరుకునే వారని అన్నారు. జీఎన్‌రావు, బోస్టన్ కమిటీలు ఇచ్చిన రిమార్క్స్‌ను
సీఎం జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసమే విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అంటున్నారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి భీమిలి, విజయనగరం మధ్యలో ల్యాండ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేశారని విమర్శించారు. అమరావతిలో భూములు కబ్జా చేసేందుకు వీలు లేకనే విశాఖలో రాజధాని అంటున్నారని, విశాఖలో పరిశ్రమలు పెట్టేవారి నుంచి వాటాలు, షేర్ల కోసమే రాజధాని ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి విశాఖ లేకుంటే ఢిల్లీలో మాత్రమే ఉంటున్నారని రాజేంద్రప్రసాద్‌ ఎద్దేవా చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/