స్రవంతిని గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే సీతక్క

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క..మునుగోడు ఉప ఎన్నికలో స్రవంతిని గెలిపించాలని ఓటర్లను కోరారు. స్రవంతిని గెలిపించి అసెంబ్లీకి పంపితే.. తామిద్దరం సమ్మక్క, సారక్కల్లా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడతామని అన్నారు. మునుగోడు అనేది పోరాటాల గడ్డ.. త్యాగాల అడ్డా అని ,పైసలతో ఓట్లను కొనాలనుకుంటున్న టీఆర్ఎస్, బీజేపీకి మునుగోడు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. గుంతలు పడ్డ రోడ్లను వాళ్లు ఎందుకు రిపేర్ చేయలేదని ఆమె ప్రశ్నించారు. పెట్టుబడిదారుల లోన్లను మాఫీ చేసిన కేంద్రంలోని బీజేపీ సర్కారు.. పేదల నిత్యావసరాల ధరలు పెరగకుండా ఏమీ చేయలేకపోయిందని సీతక్క అన్నారు.

అలాగే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ సైతం ప్రచారంలో స్రవంతిని గెలిపించాలని కోరారు. పాల్వాయి స్రవంతికి ఒక్క అవకాశం ఇవ్వండి. ఆమె రక్తం ధారపోసయినా మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంది అని అన్నారు. మునుగోడులో రాజగోపాల్ కు ఓటే లేదు అలాంటి ఆయనకు ఓటు వేయాలా ? ఆయన ఓటు కూడా ఆయన వేసుకోలేడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజగోపాల్ రెడ్డికి మునుగొడులో ఊరు లేదు… అసెంబ్లీలో నోరు లేదు అని వ్యాఖ్యలు చేశారు.