6వ రోజు ప్రారంభమైన రాహుల్ గాంధీ పాదయాత్ర

Rahul Gandhi Padayatra started on the 6th day

న్యూఢిల్లీః కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 6వ రోజుకు చేరుకుంది. యాత్రలో భాగంగా రాహుల్ పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రస్తుత కేరళలోని నెమన్ లో రాహుల్ పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రలో రాహుల్ తో పాటు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ యాత్రలో భాగంగా కేరళలో 19 రోజుల పాటు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. అయితే రాహుల్ కేరళలో 457 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో మొదలైంది కాశ్మీర్ లో ముగుస్తుంది.150 రోజుల పాటు 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలితల ప్రాంతాల గుండా 3,570 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/