చిరు-గరికపాటి ఇష్యూ ను వదలని వర్మ

రీసెంట్ గా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ‘అలయ్ బలయ్’ కార్యక్రమం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చిరంజీవి తో పాటు పలు రాజకీయ పార్టీల నేతలు , ప్రముఖులు హాజరయ్యారు. కాగా ఈ కార్యక్రమంలో చిరంజీవి ఫై ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను గరికపాటి , చిరంజీవి లైట్ తీసుకున్నప్పటికీ కొంతమంది మాత్రం కావాలనే ఈ ఇష్యూ ఫై రాద్ధాంతం చేస్తున్నారు. వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ ఈ ఇష్యూ ఫై ట్విట్టర్ లో స్పందించగా..తాజాగా మరోసారి గరికపాటిఫై ట్వీట్ చేసి మరోసారి వైరల్ గా మార్చారు.

గరికపాటి నరసింహారావు గతంలో తన ప్రవచనాల్లో ఆడవాళ్ల వేషధారణ, వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ వర్మ వరుస ట్వీట్లు చేశారు. వర్మ ట్వీట్ చేసిన వీడియోలో గరికపాటి నరసింహారావు మాట్లాడుతూ.. ‘‘అందమైనటువంటి అవయవాలు పొందికగా, బిగువుగా కనబడుతుంటే కుర్రాడనేవాడు ఎవడైనా ఊరుకోగలడా. అక్కడి నుంచి వీడు కూడాబడ్డాడు, ఏదో అన్నాడు.. ఎందుకు చేయడు. అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి. అది మా హక్కు అంటే ఏం చెప్తాం. అది వాడి హక్కు. అన్యాయానికి హక్కు ఉంటుందా? మనమేమో అవయవాలు ప్రదర్శిస్తూ శుభ్రంగా విప్పుకుని తిరుగుతూ.. ఖాళీలు కనబడేలా, ఇంకాస్త కటింగులు చేయించుకుని.. ఇళ్లాల్లండి, పెళ్లయినవారు వీరి దుంపతెగ. ముదేమో పావు కటింగ్.. వెనకేమో అరకటింగ్. ఎవరికీ ప్రదర్శనలు’’ అని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలను రామ్ గోపాల్ వర్మ తప్పుబడుతూ.. ‘‘అత్యాచారాలకు గురికావడంలో మహిళలదే బాధ్యత అని గడ్డిపాటి చెబుతున్నారు. ఆత్మగౌరవం కలిగిన మహిళలందరూ ఇతడిని బొందపెట్టాలి’’ అని ట్వీట్ చేశారు. అలాగే.. ‘‘గొర్రెపాటి కంటే అత్యంత అమర్యాదగా ఆడవాళ్ల వస్త్రధారణ గురించి ఎవరైనా మాట్లాడటం నేను చూడలేదు. ఈయన చాలా విషయాలకు చాలా దగ్గరగా ఉంటాడని నాకు అనుమానంగా ఉంది’’ అని మరో ట్వీట్ వేశారు. అంతేకాకుండా, హిందుత్వం పేరుతో అసత్యాలు ప్రచారం చేస్తున్న గరికపాటి నుంచి పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు.