రేపు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్..పాల్గొనబోతున్న కేటీఆర్

మునుగోడు ఉప ఎన్నిక బరిలో టిఆర్ఎస్ నుండి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో నిల్చున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేపు ఉదయం ఆయన నామినేషన్ వేయబోతున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరుకాబోతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తో మునుగోడు కు ఉప ఎన్నిక జరగబోతుంది. కాంగ్రెస్ పార్టీ ని విడి రాజగోపాల్ ..బిజెపి లో చేరి..ఈ ఉప ఎన్నిక లో బిజెపి నుండి పోటీ చేయబోతున్నారు. ఇప్పటీకే ఆయన నామినేషన్ దాఖలు చేసి ప్రచారం లో బిజీ గా ఉన్నారు.
ఇక రేపు టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు బంగారిగడ్డ నుంచి చండూర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీ ర్యాలీలో సీపీఐ, సీపీఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో పాల్గొననున్నట్లు తెలిపారు. రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి తన వ్యాపార లావాదేవీల కోసమే రాజీనామా చేసి, ఉప ఎన్నికకు కారణమయ్యారు. నాలుగేండ్లలో మునుగోడును పట్టించుకోని, రాజగోపాల్ ఇప్పుడేం అభివృద్ధి చేస్తారు అని ప్రశ్నించారు.