తాజా గాయాలని తేలితే తీవ్ర పరిణామాలు: హైకోర్టు హెచ్చరిక

రఘురామ కేసు విచారణకు స్పెషల్‌ డివిజన్‌ బెంచ్‌ ఏర్పాటు

Raghurama says he sustained injuries to his soles due to the beatings by the police
Raghurama says he sustained injuries to his soles due to the beatings by the police

Amaravati: హైకోర్టులో జస్టిస్‌ ప్రవీణ్‌ నేతృత్వంలో ఎంపీ రఘురామ కృష్ణ రాజు కేసు విచారణకు స్పెషల్‌ డివిజన్‌ బెంచ్‌ ఏర్పాటైంది. రఘురామ తరఫున హైకోర్టులో హేబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలైంది. రాష్ట్రంలో ఏం జరుగుతోందని హైకోర్టు ప్రశ్నించింది. ‘‘కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎలా కొడతారు? రఘు రామకృష్ణ రాజు కు తగిలినవి తాజా గాయాలని తేలితే తీవ్ర పరిణామాలు తప్పవని హైకోర్టు హెచ్చరించింది. ఈమేరకు ఎంపీ రఘురామ గాయాల పరిశీలనకు వైద్యుల కమిటీని ఏర్పాటు చేసింది.

మరోవైపు రఘు రామకృష్ణ రాజు రిమాండ్‌ రిపోర్టును సీఐడీ కోర్టు పెండింగ్‌లో పెట్టింది. ఆయన అరికాళ్లపై గాయాలు, వివరాలను న్యాయస్థానం నమోదు చేసుకుంది. ఎంపీ కాళ్లకు తగిలిన గాయాల ఆధారాలను రఘురామ న్యాయవాదులు కోర్టు కు సమర్పించారు. ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి చికిత్స కోసం ఎంపీని ఆసుపత్రికి తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇదిలా ఉంటాయి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సకు రఘురామ నిరాకరించారు. దీంతో ఆయనకు రమేశ్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించాల్సిందిగా కోర్టు అధికారులను ఆదేశించింది. తొలుత.పోలీసులు తనను తీవ్రంగా కొట్టారని.. వాళ్ల దెబ్బలకు తన కాళ్లు వాచిపోయాయని ఎంపీ రఘురామ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/