దొంగ ఓట్లంటూ ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం

వైకాపా ఎమ్మెల్యే రోజా విమర్శ

YSRCP MLA Roja
YSRCP MLA Roja

తిరుపతి ఉప ఎన్నికలలో కావాలనే ప్రతిపక్షాలు దొంగ ఓట్లంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వైకాపా నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. వారు చేసే తప్పుడు ప్రచారాలతో తమ పార్టీ ప్రతిష్ఠ దిగజారదన్నారు. దొంగ ఓట్లని ప్రచారం చేసున్నారని , మరి అలాంటపుడు పోలింగ్ బూత్ ల్లోనే దొంగ ఓటర్లను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్ కొత్త సంప్రదాయానికి తెర తీసారని ఒక్క రూపాయి పంచకుండా, ఎవరికీ మద్యం పంపిణీ చేయకుండా ప్రలోభాలు లేని ఎన్నికలు నిర్వహించారంటూ ఆమె పేర్కొన్నారు.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/