సిటీలో మేయర్ ఆకస్మిక పర్యటన

పారిశుద్ధ్యం తీరుపట్ల ఆగ్రహం

ghmc mayor Vijayalakshmi sudden visit
ghmc mayor Vijayalakshmi sudden visit

Hyderabad: సిటీలో ఆదివారం జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఆకస్మిక పర్యటన చేశారు. కొన్ని డివిజన్‌లలో తన ఆకస్మిక తనిఖీలో సిబ్బంది లోపాలను గమనించారు. స్పెషల్ డ్రైవ్ లో అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైరాతాబాద్ జోన్ పరిధిలోనే గుడిమల్కాపూర్ డివిజన్ సంతోష్ నగర్ కాలనీలో పేరుకుపోయిన చెత్తను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెహదీపట్నంలోని విజయనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో పారిశుధ్యం ఆధ్వానంపై అధికారులని నిలదీశారు. సిటీలో పారిశుధ్యం సమస్యలు లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/