మరో వివాదానికి తెరలేపిన ఎమ్మెల్యే రాజయ్య

బిఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య కు వివాదాలు కొత్తమీ కాదు. తరుచుగా ఏదోక వివాదాస్పద కామెంట్స్ చేయడం ఆ తర్వాత వార్తల్లో నిలువడం కామన్ గా మారింది. రీసెంట్ గా బిఆర్ఎస్ మహిళ సర్పంచ్ ను వేధించాడన్న వార్తలు ఆయన్ను మరింతగా వివాదంలోకి నెట్టాయి. ఆ తర్వాత నేరుగా మహిళ సర్పంచ్ ఇంటికి వెళ్లి క్షేమపణలు కోరడం తో ఆ వివాదానికి తెరపడింది.

అంతబాగానే ఉందనుకుంటున్న సమయంలో మరో వివాదానికి తెరలేపారు రాజయ్య. తాజాగా జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కాగా.. ఈ సమావేశంలో పాల్గొన్న రాజయ్య.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలేవైనా.. బీఆర్ఎస్‌దే విజయమన్నారు. “ముందు చూసినా బీఆర్ఎస్సే.. వెనక చూసినా బీఆర్ఎస్.. ఎటు చూసినా బీఆర్ఎస్సే.. బీఆర్ఎస్సే కాంగ్రెస్, కాంగ్రెస్సే బీఆర్ఎస్.. బీఆర్ఎస్ అంటే కేసీఆర్.. ఈసారి కూడా నిండుమనసుతో బీఆర్ఎస్‌ను ఆశీర్వదించి.. భారీ మెజార్టీతో గెలిపించాలి.” అంటూ నోరు జారారు. ఈ మాటలు విన్న కార్యకర్తలు , నాయకులు ఆశ్చర్యపోతూ , ఒకెత్తు షాక్ కు గురయ్యారు. దీనిపై కేసీఆర్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడో అని అంత మాట్లాడుకుంటున్నారు.