దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అరెస్టు

mla-raghunandan-rao-arrested

హైదరబాద్‌ః దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి గజ్వేల్‌కు బయలుదేరిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకొని అల్వాల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. గజ్వేల్‌లో శివాజీ విగ్రహం దగ్గర ఘర్షణల్లో బాధిత హిందూ యువకులను పరామర్శించడానికి వెళుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకుని ఎమ్మెల్యే రఘునందన్ రావును అరెస్ట్ చేశారు.