నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

గుంటూరుజిల్లావ్యాప్తంగా 134 కేంద్రాలు

పరీక్షా హాలులో విద్యార్థులు (ఫైల్)

గుంటూరు: ఇంటర్మీడియట్‌ ఫైనల్‌ పరీక్షల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి జడ్‌ఎస్‌ రామచంద్రరరావు తెలిపారు.

ఈనెల 4 నుండి 18వ తేదీ వరకు ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరగనున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌళికవసతులు కల్పించారు.

ఈ సందర్భంగా ఆర్‌ఐవో కార్యాలయంలో పరీక్షలకు సంబందించిన వివరాలను ఆర్‌ఐఓ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా లక్ష 5వేల 472 మంది పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు.

జిల్లాలో 134 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు పకడ్బందీగా జరిగేందుకు సీసీ కెమారాలను ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ ద్వారా పరీక్షల సరళిని అధికారులు తెలుసుకునేలా ఏర్పాట్లు చేయటం జరిగిందన్నారు. విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు నేరుగా చేరుకునేం దుకు ఐటిఈ సెంటర్‌ లొకేటర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చ న్నారు.

ఈ యాప్‌ ద్వారా విద్యార్థులు పరీక్షా కేంద్రం ఏ ప్రదేశంలో ఉన్నది, తాము అక్కడికి చేరుకునేందుకు గూగుల్‌మ్యాప్‌ సహాయపడు తుందన్నారు. అలాగే పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు కేటాయించిన స్థానాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా కనుగొనేందుకు ఇంటర్మీడియట్‌ బోర్డు వెబ్‌సైట్‌లో విద్యార్థులు తమ హాల్‌టిక్కెట్‌ వివరాలను ఎంటర్‌ చేసిన

ఈ యాప్‌ ద్వారా విద్యార్థులు పరీక్షా కేంద్రం ఏ ప్రదేశంలో ఉన్నది, తాము అక్కడికి చేరుకునేందుకు గూగుల్‌మ్యాప్‌ సహాయపడు తుందన్నారు. అలాగే పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు కేటాయించిన స్థానాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా కనుగొనేందుకు ఇంటర్మీడియట్‌ బోర్డు వెబ్‌సైట్‌లో విద్యార్థులు తమ హాల్‌టిక్కెట్‌ వివరాలను ఎంటర్‌ చేసిన

వెంటనే పరీక్షా కేంద్రంలో ఏ రూమ్‌లో ఏ బెంచ్‌లో వారికి స్థానం కేటాయించబడింది అనే వివరాలను ఎస్‌ఎంఎస్‌ రూపంలో వివరాలు పొందవచ్చన్నారు. ఉదయం 9 నుండి మద్యాహ్నం 12 గంటల వరకు జరిగే పరీక్షలకు విద్యార్థులు 8 గంటలకు పరీక్షా కేంద్రాల్లోకి చేరుకోవాలన్నారు. 8.30 కి తనిఖీలు చేసిన పిదప పరీక్షా హాల్లోకి అనుమతించబడతారన్నారు.

పరీక్షల్లో ఎటువంటి కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండ నాలుగు ఫ్లైయింగ్‌, 8 సిట్టింగ్‌ స్క్వాడ్‌లు, ఇంటర్‌ విద్య ఆర్‌జీడీ, జిల్లా ఒకేషనల్‌ అధికారులు నిరంతర పర్యవేక్షిస్తారన్నారు. పరీక్షా సమయాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్‌ విధించబడిందన్నారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో జిరాక్స్‌ సెంటర్లు మూసివేసేలా ఆదేశాలివ్వడం జరిగిందన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేందుకు ప్రత్యేక రూట్లలో ఆర్టీసీ బస్సులు నడుస్తాయన్నారు.

కళాశాల యాజమాన్యాలు ఫీజులను ముడిపెట్టి విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు తమ హాల్‌టిక్కెట్లను ఆన్‌లైన్‌ ద్వారా నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/