వైస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంశ్రీధర్ రెడ్డి హౌస్ అరెస్ట్

వైస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ని పోలీసులు హౌస్‌ అరెస్ట్ చేసారు. కొద్దీ రోజుల క్రితం వైస్సార్సీపీ అధిష్టానం శ్రీధర్ రెడ్డి ని పార్టీ నుండి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందే ఈయన పార్టీ ని వీడుతున్నానని ప్రకటించారు. అప్పటి నుండి వైస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నారు. ఒక తాజాగా ఈయన రెండు రోజుల క్రితం చెప్పిన విధంగా పొట్టేపాలెం కలుజు కాలువలో జలదీక్ష 6 వ తేదీ దాదాపు 10 గంటల పాటు చేపట్టనున్నట్లు ప్రకటించారు.

అయితే ఈ దీక్షకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. పైగా కాసేపటి క్రితమే కోటంరెడ్డి ఇంటికి వెళ్ళిన పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇంటి ఎదుటే కోటంరెడ్డి దీక్షకు దిగారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా కోటంరెడ్డి అనుచరులు నినాదాలు చేస్తున్నారు.

అయితే కోటంరెడ్డి హౌస్ అరెస్ట్‌కు ముందు హైడ్రామాయే నడిచింది. కోటంరెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు.. నేరుగా తలుపులు నెట్టారు. దీంతో పోలీసులపై కోటంరెడ్డి తీవ్ర ఆగ్రహంవ్యక్తం చేశారు. ‘ఏదో డాన్ ఇంటిని ముట్టడించినట్టు నా ఇంటిని, మాగుంట లే అవుట్ మొత్తం రౌండప్ చేస్తారా?’ అంటూ ఫైర్ అయ్యారు. ఖచ్చితంగా దీక్ష చేస్తానని తేల్చి చెప్పారు. ‘మీరు డ్యూటీలు‌ మాని ఎంతో కాలం నా వెనుక తిరగలేరు’ అని స్పష్టం చేశారు.