హనుమాన్ జయంతి సందర్బంగా ఆదిపురుష్ నుండి సరికొత్త పోస్టర్

నేడు హనుమాన్ జయంతి సందర్బంగా ఆదిపురుష్ నుండి హనుమాన్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ప్రభాస్ – కృతి సనన్ జంటగా ఓం రనౌత్ డైరెక్షన్లో పాన్ ఇండియా మూవీ గా ఆదిపురుష్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో రీసెంట్ గా శ్రీరామనవమి సందర్బంగా సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసి ఆకట్టుకున్న మేకర్స్..ఈరోజు హనుమాన్ జయంతి సందర్బంగా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో వెనుక రాముడు ఫేస్ ఉండి ముందు హనుమంతుడు ధ్యానం చేసుకుంటున్నాడు.

హనుమంతుడి పోస్టర్ ని షేర్ చేసి.. రాముడికి భక్తుడు, రామ కథకి ప్రాణం, జై పవన పుత్ర హనుమాన్ అని పోస్ట్ చేశారు. ఈ సినిమాలో హనుమంతుడిగా దేవ్‌దత్త నగే నటించాడు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో ప్రభాస్ రాముడిగా , కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.