‘వాలెంటైన్ డే’ సందర్భంగా ‘మిస్టర్‌ బచ్చన్‌’ నుండి కొత్త పోస్టర్

ఈగల్ తో సూపర్ హిట్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్లో ‘మిస్టర్‌ బచ్చన్‌’ మూవీ చేస్తున్నాడు. ధమాకా తర్వాత సరైన హిట్ లేని రవితేజ..రీసెంట్ గా ఈగల్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కార్తీక్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సక్సెస్ జోష్ లో రవితేజ ‘మిస్టర్‌ బచ్చన్‌’ పూర్తి చేసే పనిలో ఉన్నారు. గతంలో హరీష్ – రవితేజ కలయికలో షాక్ , మిరపకాయ్ మూవీస్ వచ్చాయి. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ గా రాబోతుంది.

టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా తాజాగా కీలక షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. నేడు ‘వాలెంటైన్ డే’ సందర్భంగా ఈ చిత్రం నుంచి చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ వదిలారు. రవితేజ, భాగ్యశ్రీ బోర్స్ ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకున్న రొమాంటిక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. ‘రవితేజ గట్టిగానే పట్టుకున్నాడే’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మిస్టర్‌ బచ్చన్‌కు ‘నామ్ తో సునా హోగా’ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రంలో రవితేజ పూర్తి భిన్నమైన లుక్‌తో కనిపించనున్నారని, ఆయన కెరీర్‌లో ‘మిస్టర్‌ బచ్చన్‌’ సినిమా ప్రత్యేకంగా అవుతుందని మేకర్స్‌ తెలిపారు.