ఓటరు స్లిప్‌, పోలింగ్‌ కేంద్రం తెలుసుకునేందుకు యాప్‌

జీహెచ్‌ఎంసీ యాప్‌లో యువర్‌ పోలింగ్‌ స్టేషన్‌ ఆప్షన్‌

GHMC App

Hyderabad: గ్రేటర్‌ హైదరాబాద్‌లో డిసెంబర్‌ ఒకటిన జరగనున్న పోలింగ్‌కు ఓటరు గుర్తింపు కార్డు లేనివారు ఇతర గుర్తింపు పత్రాలు చూపి తమ ఓటుహక్కును వినియోగించుకోవచ్చని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు.

ఓటు వేయడానికి ముందు పోలింగ్‌ కేంద్రంలో వారి గుర్తింపు నిర్థారణకు ఏదైనా గుర్తింపు కార్డును చూపవచ్చన్నారు.

ఓటుహక్కు వినియోగించుకునేవారు తమ ఓటరు స్లిప్‌ను పొందడంతోపాటు పోలింగ్‌ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు జీహెచ్‌ఎంసీ సరికొత్త యాప్‌ను రూపొందించింది.

ఇందులో పోలింగ్‌ కేంద్రానికి వెళ్లే మార్గాన్ని కూడా గూగుల్‌ మ్యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఓటరు స్లిప్‌ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ అవి అందనివారి సౌకర్యార్థం యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు తెలిపారు.

ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ద్వారా మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో యువర్‌ పోలింగ్‌ స్టేషన్‌ ఆప్షన్‌లో క్లిక్‌ చేసి ఓటరు పేరు, వార్డు పేరు ఎంటర్‌చేస్తే ఓటరు స్లిప్‌తోపాటు పోలింగ్‌ బూత్‌ ఎక్కడుందో గూగుల్‌ మ్యాప్‌ లొకేషన్‌ వస్తుంది.

పేరుకు బదులుగా ఓటరు గుర్తింపుకార్డు నెంబర్‌, వార్డు పేరు ఎంటర్‌ చేసినా ఓటరు స్లిప్‌, పోలింగ్‌ కేంద్రం గూగుల్‌ మ్యాప్‌ వస్తుంది.

ఈ నో-యువర్‌ పోలింగ్‌ స్టేషన్‌ యాప్‌పై చైతన్యం కలిగించేందుకు జీహెచ్‌ఎంసీ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది.

ఇప్పటికే ఈ యాప్‌పై స్థానిక కాలనీ సంక్షేమ సంఘాలకు వాట్సాప్‌ ద్వారా సమాచారం అందిస్తున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/