ఎన్నికల్లో గెలుపోటములు సహజం: మంత్రి వేముల

టీఆర్ఎస్ ఒక‌ ఎన్నికలో ఓడినప్ప‌టికీ మరో ఎన్నికలో విజయం సాధిస్తోంది: మంత్రి వేముల ప్రశాంత్

హైదరాబాద్: తెలంగాణ‌లోని హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో బీజేపీ అభ్య‌ర్థి ఈటల రాజేంద‌ర్ చేతిలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీ‌నివాస్ యాదవ్ ఓడిపోయిన విష‌యం తెలిసిందే. దీనిపై తెలంగాణ‌ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ.. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని హిత‌వు పలికారు. ఇప్ప‌టివ‌ర‌కు టీఆర్ఎస్ పార్టీ చాలా ఎన్నికలను చూసిందని ఆయ‌న చెప్పారు.

త‌మ పార్టీ ఒక‌ ఎన్నికలో ఓడినప్ప‌టికీ మరో ఎన్నికలో విజయం సాధిస్తుంద‌ని తెలిపారు. తాము గ‌తంలో నాగార్జున సాగర్‌తో ఉప ఎన్నిక‌తో పాటు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్న‌ సీటును కూడా గెలుచుకున్నామ‌ని అన్నారు. కాగా, ఆయ‌న ఈ రోజు ఉద‌యం తిరుమ‌ల శ్రీవారిని కుటుంబ సమేతంగా ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగానే హుజూరాబాద్ ఉప‌ ఎన్నిక‌లో ఓట‌మి అంశంపై స్పందించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/