ఆరో రోజు కొనసాగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర

అమరావతి : రాజధాని రైతులు చేస్తున్న మహాపాదయాత్ర ఆరో రోజు కొనసాగుతోంది. శనివారం ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. పెదనందిపాడు నుంచి పర్చూరు వరకు 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. 3 రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. మొత్తం 45 రోజుల పాటు పాదయాత్ర సాగనుంది. డిసెంబరు 15న తిరుపతిలో ముగియనుంది.

కాగా, ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర ఈనెల 1న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ పాదయాత్రకు వైస్సార్సీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా పాదయాత్ర జరుగుతుంది. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు అన్నదాలకు పూల వర్షంతో స్వాగతం పలుకుతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/