తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు

వాతావరణ కేంద్రం వెల్లడి

Heavy rains in ap,ts states

రానున్న 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖపేర్కొంది. తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. తెలంగాణ లో కుమురం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేశారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో ఉత్తర కోస్తా, యానాం లో ఇవాళ ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం పడే అవకాశం, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండాలి అధికారులు తెలిపారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/