చంద్రబాబుపై వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలు

స్థానిక ఎన్నికల వాయిదాకు బాబు మొదటి నుంచి యత్నించారు

Vellampalli Srinivas
Vellampalli Srinivas

అమరావతి: ఏపి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..టిడిపి అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు వాయిదా వేయించాలని మొదటి నుంచి చంద్రబాబు ప్రయత్నించారని వెల్లంపల్లి అన్నారు. సిఎం జగన్‌ జగన్ సుపరిపాలన చూసి బాబు ఓర్వలేకపోతున్నారని, ఎన్నికలు ఎదుర్కోలేకనే బాబు కుట్ర చేశారని ఆరోపించారు. ఈసీని మేనేజ్ చేసే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయారని, జగన్ పై కన్నా దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. షూటింగ్స్ చేసుకుంటూ ఎన్నికల రద్దు గురించి పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని ఘాటుగా విమర్శించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/