అస్సాగో బయో ఇథనాల్‌ కంపెనీకి శంకుస్థాపన చేసిన సిఎం జగన్‌

YouTube video
Hon’ble CM will be Participating in Ground Breaking Ceremony of ASSAGO Industries Pvt Ltd at EG Dist

అమరావతిః తూర్పుగోదావరిజిల్లా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డిలో అస్సాగో బయో ఇథనాల్‌ కంపెనీకి సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. ఏపీకి ఇథనాల్ ప్లాంట్‌ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ప్లాంట్‌ వలన రైతులు, స్థానిక యువతకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో బయో ఇథనాల్‌ యూనిట్లు ఏర్పాటు చేయడానికి అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి దగ్గర 270 కోట్లతో అస్సాగో ఇండస్ట్రీస్‌ ఏర్పాటు చేశారు.

రాజమండ్రి సమీపంలోని ఏపీఐఐసీ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో 20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ గ్రీన్‌ఫీల్డ్‌ యూనిట్‌ ద్వారా రోజుకు 200 కిలోలీటర్ల బయో ఇథనాల్‌ ఉత్పత్తి అవుతుంది. ఈ యూనిట్‌ ద్వారా ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా 400 మందికి ఉపాధి లభించనుంది. ముడిచమురు దిగుమతుల బిల్లును తగ్గించుకోవడంతోపాటు హరిత ఇంధన వినియోగం పెంచడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంగా 2025–26 నాటికి ప్రతి లీటరు పెట్రోల్‌లో 20 శాతం బయో ఇథనాల్‌ మిశ్రమం కలపడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

ఈ యూనిట్‌ ద్వారా 500 మందికి ఉపాధి లభించడమే కాకుండా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ రైతులకు అదనపు ప్రయోజనం లభిస్తుంది. పాడైపోయిన ఆహారధాన్యాలు, నూకలు, వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలు వినియోగించి ఇథనాల్‌ను తయారు చేయడం ద్వారా రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. రాష్ట్రంలో బయో ఇథనాల్‌ యూనిట్లు ఏర్పాటు చేయడానికి అనేక కంపెనీలు ముందుకొస్తున్నాయి.అస్సాగోతో పాటు క్రిభ్‌కో, ఇండియన్‌ ఆ యిల్‌ కార్పొరేషన్, ఎకో స్టీల్, సెంటిని, డాల్వకో ట్, ఈఐడీ ప్యారీ వంటి సంస్థలు కలిపి సుమారు రూ.2,017 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/